హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వామ్మో ఎంత పెద్ద చేపనో..!

NRML: నర్సాపూర్ మండల కేంద్రంలోని శుద్ధ వాగులో చేపల వేట రోజూలాగే సాగినా, ఈసారి మాత్రం స్థానికుడు జావీద్‌కు ఊహించని అదృష్టం దక్కింది. ఇవాళ శుద్ధ వాగులో చేపల వేటకు వెళ్లగా, ఆయన వేసిన గాలానికి భారీ సైజులో ఉన్న వాలుగు చేప చిక్కింది. దీని బరువు తూకం వేయగా ఏకంగా 15 కిలోలు ఉన్నట్లు తేలింది. శుద్ధ వాగులో ఇంతటి భారీ చేప దొరకడంతో జావిద్ ఆనందం వ్యక్తం చేశారు.