హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీలు అమలు చేసే వరకు పోరాటం: గీతన్నలు

WGL: గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన గీతన్నల చైతన్య యాత్ర వర్ధన్నపేట పట్టణంకు చేరుకుంది. రాష్ట్రఅధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ.. గీత కార్మికుల సంక్షేమం, ఉపాధి, పెన్షన్, ఎక్స్‌గ్రేషియా, రక్షణ చర్యలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.