MDK: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఘన నివాళులర్పించారు. తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవం, ధీరత్వానికి పాపన్న గౌడ్ ప్రతీక అని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. పాపన్న ఆశయాలను భావితరాలకు చేరేలా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
తెలంగాణ
సర్వాయి పాపన్న గౌడ్‌కి హరీష్ రావు నివాళి


