హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపుతప్పి కారు బోల్తా

SRD: సదాశివపేట పట్టణ పరిధిలో నిజాంపూర్ బైపాస్ NH-65 పై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి అవతలి వైపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.