కోనసీమ: గోదావరి డెల్టా ఆధునికీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం శుభపరిణామమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కాలువలు, డ్రెయిన్లు, లాకులు, షట్టర్ల ఆధునికీకరణతో డెల్టా రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కాటన్ బ్యారేజీ గేట్ల మరమ్మతులకు ఇప్పటికే రూ.150 కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి డెల్టా ఆధునికీకరణకు రూ.3 వేల కోట్లు.. ఎమ్మెల్యే హర్షం


