హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

SDPT: పాములపర్తి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, యువత, పెద్దలు కలిసి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ చూపిన ధైర్యం, స్వాభిమానం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం వంటి ఆదర్శాలను స్మరించుకోవాలన్నారు.