హైదరాబాద్: 28°C
తెలంగాణ

బషీరాబాద్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు

HYD: పేట్‌ బషీరాబాద్‌లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. పోలీసులు 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. నాగ్‌పూర్‌ నుంచి గంజాయిని తీసుకొచ్చి ఆటోలో తరలిస్తున్న నిందితులు.. స్పీకర్‌ బాక్స్‌లో దాచి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హమీద్‌ గ్యాంగ్‌ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న 25 మంది వినియోగదారుల లిస్ట్ ఉంది.