హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం..!

NZB: చందూర్‌లో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పంచాయతీ ఎలక్ట్రిషియన్ సయ్యద్ ఖలీం తెలిపారు. ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 12:49 గంటల వరకు కొత్త వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, వినియోగదారులు సహకరించాలని కోరారు.