NRPT: కొత్తపల్లి మండలంలోని గోకుల్‌నగర్–మద్దూరు రోడ్డుకు ఇరువైపులా ముళ్లకంపలు పెరిగి వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. రోడ్డుపైకి పొదలు రావడంతో ఎదురుగా వచ్చే వాహనాలను గమనించడం కష్టమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారుల భద్రత దృష్ట్యా పొదలను తొలగించి రోడ్డును శుభ్రం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
ముళ్ల పొదలతో నిండిన రోడ్డు..!


