హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ బ్యాట్‌తో సనత్ సాంగ్వాన్ విధ్వంసం

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ 2026లో సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్ ఓపెనర్ సనత్ సాంగ్వాన్ దుమ్మురేపాడు. వెస్ట్ డెల్లీ లయన్స్‌పై కేవలం 54 బంతుల్లో 111పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 16 బౌండరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌తో సనత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం విశేషం. 170 పరుగుల లక్ష్యాన్ని సౌత్ డెల్లీ సూపర్‌స్టార్స్ సునాయాసంగా ఛేదించింది.