హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్లలో మహాలక్ష్మి ఫర్నిచర్‌లో భారీ అగ్నిప్రమాదం

SRCL: సిరిసిల్ల–పెద్దూరు ప్రధాన రహదారిపై మహాలక్ష్మి ఫర్నిచర్‌లో ఇవాళ భారీ అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగి సామగ్రికి వ్యాపించాయి. దట్టమైన పొగతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.