PDPL: పెద్దపల్లి పట్టణంలో నిన్న రాత్రి చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వాకింగ్ చేస్తున్న నూనె స్వరూప అనే మహిళ మెడలోని సుమారు 4 తులాల బంగారు గొలుసు, పుస్తెలతాడును పల్సర్ బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పెద్దపల్లిలో చైన్ స్నాచింగ్ కలకలం


