SRD: అమీన్పూర్(M) సుల్తాన్‌పూర్ గ్రామంలోని భూదాన్ ల్యాండ్, సర్వే నంబర్ 30లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో సోమవారం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. తహసీల్దార్ వెంకటేష్ ఆదేశాలతో ఎస్‌ఐ సంగీత జేసీబీలతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని తహసీల్దార్ హెచ్చరించారు.
తెలంగాణ
'అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు'


