హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్తను వదిలిరాలేదని ప్రియుడి పైశాచికం..!

NGKL: జిల్లాలోని వెల్దండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను వదిలి తన వద్దకు రావాలని వివాహిత అనూషపై రాములు ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆమె అందుకు నిరాకరించడంతో పాటు గర్భం దాల్చిందనే కారణంతో కక్ష పెంచుకున్న రాములు, అనూషను హత్య చేసి డీజిల్ పోసి మృతదేహాన్ని కాల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.