హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: CM రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ రేపు నిర్వహించే CWC సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. రేపు రాత్రి ఢిల్లీ నుంచి లండన్ పర్యటనకు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి అమెరికాకు పయనమవుతారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. ఇలా 11 రోజుల పర్యటన అనంతరం ఈనెల 30న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.