హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

SRPT: తాటి చెట్టు పై నుంచి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఘటన నాగారం మండలంలోని ఈటూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్ గౌడ్ ఉదయం తాటి చెట్లు గీయడానికి వెళ్లి అకస్మాత్తుగా చెట్టు పైనుంచి ఒక్కసారిగా కింద‌ప‌డ్డాడు. దీంతో అతని కాలు విరిగి గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి తరలించారు.