హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక అలంకరణలో పాతపట్నం అమ్మవారు

SKLM: పాతపట్నం పురప్రసిద్ధ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మంగళవారం భక్తులకు కనులపండువగా ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. పూజారులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారిని రకరకాల పూలతో, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. నీలం రంగు చీర, నగలతో కొలువుదీరిన అమ్మవారి రూపాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు.