NGKL: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 17 ఉదయం నుంచి 18 ఉదయం వరకు నమోదైన వర్షపాత వివరాల ప్రకారం కల్వకుర్తిలో 1.5 మి.మీ., తిమ్మాజీపేటలో 0.8 మి.మీ. మాత్రమే వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు..!


