హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెడ్ పోస్టాఫీసుకు మోడల్ హోదా

SRD: హెడ్ పోస్టాఫీస్‌లో త్వరలోనే పాస్‌పోర్ట్ సేవలు, ప్రత్యేక పార్సిల్ యూనిట్ అందుబాటులోకి రానున్నాయి. దీనిని మోడల్ పోస్టాఫీస్‌గా అభివృద్ధి చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఎంపీ రఘునందన్‌రావు విజ్ఞప్తికి స్పందించి అనుమతులు మంజూరు చేసిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.