NLG: చిట్యాల మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మండల సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్తు సీఈఓ ఆదేశాల మేరకు జరిగే ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఎంపీడీవో పాండు తెలిపారు. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచ్‌లు ఈ సమావేశానికి విధిగా హాజరుకావాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు చిట్యాలకు రానున్న ప్రభుత్వ విప్ వేముల


