హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుర్లవారిపాలెంలో ఉచిత వైద్య శిబిరం

BPT: బుర్లవారిపాలెం గ్రామంలోని రోహిణి ఫార్మా క్లినిక్‌లో రమేష్ డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో షుగర్, బీపీ, రక్తశాతం, గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. గ్రామస్తులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సుమారు 60 నుంచి 70 మంది గ్రామస్తులు వైద్య శిబిరానికి హాజరై వివిధ పరీక్షలు చేయించుకున్నారు.