హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాస్థాయి టెన్నిస్ పోటీలు

అనంతపురంలో ఈ నెల 28-30 వరకు అండర్-10,12,14,16, సీనియర్స్ విభాగాల్లో జిల్లాస్థాయి లాన్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి నాగరాజుబాబు తెలిపారు. ప్రతి విభాగంలో మొదటి ఐదుగురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఆర్డీటీ స్టేడియంలోని నాదల్ టెన్నిస్ అకాడమీలో జరిగే ఈ పోటీలకు ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.