హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీఆర్ సెంటర్‌ను సందర్శించిన కమిషనర్

NDL: డోన్ మండలం కొత్తకోట సమీపంలో నిర్మాణంలో ఉన్న ఐటీడీఆర్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్) సెంటర్‌ను సోమవారం జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డా.సుందర్ వడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. డీఈ మదన్ గోపాల్, ఎంవీఐ క్రాంతికుమార్, ఆర్‌అండ్‌బీ, ఆర్టీఓ సిబ్బంది పాల్గొన్నారు.