హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధానమంత్రిని కలిసిన గోవా గవర్నర్

VZM: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు భారత ప్రధాని నరేంద్ర మోదీని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ప్రతిమను ప్రధానమంత్రికి జ్ఞాపికగా అందజేశారు. సింహాచలం విశిష్టతను ప్రధానకి వివరించారు.