BPT: చిలకలూరిపేట మండలం బొప్పూడికి ఈ నెల 27న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బొప్పూడి కొండపై కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్దికి టీటీడీ రూ. 10.99కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
27న బొప్పూడికి గవర్నర్ రాక


