హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల నీటితో పంటలను ఆదుకోవాలని వినతి

GDWL: వర్షాభావంతోపాటు జూరాల కాలువ నీరు అందక మిర్చి, పత్తి పంటలు వాడిపోతున్నాయని మానవపాడు, ఇటిక్యాలపాడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జల్లాపురం సర్పంచ్ నందిని వజ్రా, రైతు సంఘం నాయకులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషాను కలిసి వినతిపత్రం సమర్పించారు. వెంటనే కాలువకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు.