హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాబాల వేషంలో డబ్బుల వసూళ్లు.. ముగ్గురి పట్టివేత

JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేటలో సోమవారం బాబాల వేషధారణలో కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణదారుల వద్ద డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఆశీర్వాదం పేరుతో పొగ మందు చల్లడంతో ఇద్దరు దుకాణదారులు అనుమానించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులు నిలదీయడంతో వారు పారిపోయేందుకు యత్నించగా పోలీసులకు సమాచారం అందించారు.