హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలి'

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిన్న జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నవీన్ ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదులను, నిర్ణీత గడువులోపు పరిష్కరించి, ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.