SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా ఆలయ గోపురం ఇవాళ ఉదయం కుప్పకూలింది. 26 ఏళ్ల క్రితం నిర్మించిన గోపురం ఇటీవల కురుస్తున్న వర్షాలకు తడిసిపోవడంతో పాటు లోపలి ఇనుము తుప్పుపట్టడం వల్ల బలహీనపడి కూలినట్లు తెలుస్తోంది. గోపురం ఒక్కసారిగా కూలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
తెలంగాణ
వర్షాలకు కూలిన సాయిబాబా ఆలయ గోపురం!


