GDWL: పవిత్ర శ్రావణ మాసం మొదటి మంగళవారం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులోని శ్రీ జమ్ములమ్మ ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
జమ్ములమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు


