హైదరాబాద్: 28°C
క్రీడలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ

భారత క్రికెటర్‌ తిలక్ వర్మ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన తిలక్ వర్మతో ఫొటోలు దిగేందుకు పలువురు ప్రయత్నించారు.