హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీర్ బాటిల్‌తో దాడి.. నిందితులు అరెస్ట్

కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి మహేష్‌పై బీర్ బాటిల్, మద్యం సీసాలతో దాడి చేసిన బూడిద నవీన్‌గౌడ్, కమ్మరి నవీన్ అలియాస్ కుమార్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సింక్ రిపేర్ విషయంలో జరిగిన వివాదమే దాడికి కారణమని సీఐ కె.రామ్‌చందర్‌రావు తెలిపారు. గాయపడిన మహేష్‌ను ఆసుపత్రికి తరలించగా, నిందితులను కోర్టులో హాజరుపరిచారు.