హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఓటర్లు ఎంతమందంటే..?

SRPT: జిల్లాలో 1,212 పోలింగ్‌ కేంద్రాల్లో 9,11,945 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 4,47,090, మహిళలు 4,64,806, ఇతరులు 49 మంది ఉన్నారు. సూర్యాపేటలో 2,20,335, తుంగతుర్తిలో 2,42,333 హుజూర్‌నగర్‌లో 2,27,398, కోదాడలో 2,21,879, మంది ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్‌ 16 వరకు ఫారం-6 ద్వారా ఓటరు నమోదు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.