హైదరాబాద్: 28°C
వ్యాపారం

నేటి టాటా AGMకు బ్రేక్!

ఇవాళ జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌పై మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ ఆంక్షలు విధించడంతో వారి ప్రతినిధి నామినేషన్‌కు బ్రేక్ పడింది. కాగా, ఈ AGMలో చంద్రశేఖరన్‌ పదవీకాలం పొడిగింపు, 2025-26 ఆర్థిక ఖాతాల ఆమోదం, డివిడెండ్‌ ప్రకటనపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.