2024-25తో పోలిస్తే 2025-26లో పసిడి డెరివేటివ్స్ వ్యాపారం ఊపందుకుంది. పసిడి ఫ్యూచర్స్ రోజువారీ టర్నోవర్ మూడు రెట్లు పెరిగి రూ.28,484 కోట్లకు చేరగా, సగటు పరిమాణం 23 టన్నులకు పెరిగింది. అలాగే పసిడి ఆప్షన్స్‌లో అత్యధికంగా రోజువారీ టర్నోవర్ రూ.28,148 కోట్ల నుంచి ఏకంగా రూ.1.93 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఆప్షన్స్ సగటు పరిమాణం కూడా 36 నుంచి 156 టన్నులకు చేరింది.
వ్యాపారం
పసిడి ఆప్షన్స్‌లో భారీ జంప్


