BHPL: చిట్యాల రిపోర్టర్ రవితేజపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పలువురు జర్నలిస్టులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, విధులు నిర్వహించే వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
"జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి"


