హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

MLG: తాడ్వాయి మండలం కామారం (పిటి)కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాయం కీర్తిమంతారావు (SGT) అనారోగ్యంతో మృతి చెందారు. కామారం (పిటి) ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో కామారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.