HYD: భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్యను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణను భార్య సునీత సెంట్రింగ్ కర్రతో కొట్టగా తీవ్ర గాయాలయ్యాయి. వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని కుమారుడికి తప్పుడు సమాచారం ఇచ్చింది. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారించగా హత్యాగా తేలింది.
తెలంగాణ
భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ..!


