MDCL: చెంగిచర్ల డిపోలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి నిన్న తెలిపారు. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రెండేళ్లకు పైగా డ్రైవింగ్ అనుభవం ఉండాలన్నారు. దరఖాస్తును డిపో మేనేజర్ కార్యాలయంలో ఈనెల 20లోగా అందజేయాలన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
చెంగిచర్ల డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు


