హైదరాబాద్: 28°C
తెలంగాణ

"ఎకరాకు రూ.12 లక్షల పరిహారం ఇవ్వాలి"

JN: వెల్దండ రైట్ మెయిన్ కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తరిగొప్పుల మండలం సోలిపురం రైతులు ఎకరాకు రూ.12 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం జనగామ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌కు వినతిపత్రం అందజేశారు. పక్క జిల్లాలో రూ.12 లక్షలు ఇస్తుండగా, తమకు రూ.7 లక్షలు మాత్రమే ఇవ్వడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.