HNK: ధర్మసాగర్ మండలం రాంపూర్ చెరువు వద్ద పోలు వెంకన్న(45) దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి చెరువు వద్ద మద్యం సేవించిన అనంతరం తెల్లవారుజామున 1:30 గంటలకు మాటామాటా పెరగడంతో తన వెంట వచ్చిన వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. పాత గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
మద్యం మత్తులో దారుణ హత్య..!


