హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కు ఎంపికలు

NGKL: హనుమకొండలో జరగనున్న 12వ తెలంగాణ స్టేట్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ కోసం నాగర్‌కర్నూల్ జిల్లా స్థాయి సెలక్షన్స్‌ను కల్వకుర్తిలో సోమవారం నిర్వహించారు. జయప్రకాశ్‌నగర్‌ గురుకుల పాఠశాల మైదానంలో జరిగిన పోటీల్లో 250 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించాలని నిర్వాహకులు సూచించారు.