హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం

JGL: కొండగట్టు వద్ద కరీంనగర్–జగిత్యాల రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు ఘటనను పర్యవేక్షించాలని సూచించారు.