హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసముద్రంలో పులి సంచారం..?

MHBD: కేసముద్రం మండలం అర్పణపల్లిలో పులి సంచరించిందంటూ వస్తున్న వార్తలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన గండికోట కుమార్ తన పొలం వద్ద పులిని ప్రత్యక్షంగా చూసినట్లు చెపుతున్నాడు. సాయంత్రం పొలానికి వెళ్లినప్పుడు పొదల్లో ఏదో కదలిక కనిపించిందని, దగ్గరకు వెళ్లి చూడగా పెద్దపులి ఉందన్నాడు. అధికారులు పరిశీలించి, నిర్ధారించాల్సి ఉంది.