హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంటు షాక్‌‌తో యువకుడు మృతి

HYD: నగరంలో దారుణ ఘటన జరిగింది. గుజరాత్‌కు చెందిన సంజు చౌదరి బాలానగర్‌ BBR ఆసుపత్రి ఎదురుగా హార్డ్‌వేర్‌ షాపు నడుపుతున్నారు. షాపు గోడకు వేలాడదీసిన పేరుబోర్డు ఊడుతుండడంతో బైండింగ్‌ వైరుతో కట్టేందుకు సంజు బిల్డింగ్ పైకి ఎక్కాడు. ఈ క్రమంలో పైన వేలాడుతున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగల నుంచి కరెంటు షాక్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.