హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యానికి బానిసై యువకుడి మృతి

NDL: బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురంలో అతిగా మద్యం సేవించడంతో రాఘవేంద్ర(26) మృతి చెందాడు. ఎస్సై జగన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మద్యం సేవించి అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని గ్రామస్థులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు తెలిపారు.