హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదేళ్ల తర్వాత కాలువలోకి సాగునీరు

JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం 4ఎల్ కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సుమారు పదేళ్ల క్రితం కాలువ నిర్మించిన ఇంతవరకు నీరు పారలేదని తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి సాగునీరు అందేలా కృషి చేశారని రైతులు పేర్కొన్నారు. రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.