హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెల్‌ఫోన్ బ్లాస్ట్.. తప్పిన ప్రమాదం..!

MBNR: ఊట్కూరు(M) బిజ్వార్‌లో సెల్‌ఫోన్‌ పేలిన ఘటన చోటుచేసుకుంది. మాదారం నవీన్‌ ఉదయం సెల్‌ఫోన్‌ను జేబులో పెట్టుకుని పొలానికి వెళ్తుండగా ఫోన్‌ అకస్మాత్తుగా వేడెక్కడంతో బయటికి తీస్తుండగా పేలిపోయింది. ఫోన్‌ను ఆలస్యంగా తీసి ఉంటే తీవ్ర గాయాలయ్యేవని నవీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.