KRNL: ఆదోని కాజీపురాకు చెందిన కరీం బాషా సోమవారం విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. క్రాంతినగర్‌లో సెంట్రింగ్ పనులు చేస్తుండగా భవనంపై ఉన్న 11 కేవీ హైటెన్షన్ వైర్లు తగలడంతో కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.
ఆంధ్రప్రదేశ్
హైటెన్షన్ వైర్లు తగిలి కార్మికుడికి గాయాలు


