హైదరాబాద్: 28°C
తెలంగాణ

చురుగ్గా మూడో లైన్‌ రైల్వే పనులు

MHBD: డోర్నకల్‌లో మూడో లైన్‌ నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సోమవారం పాత రైలు పట్టాలను తొలగించి, ఆధునిక రిమోట్‌ కంట్రోల్‌ యంత్రాలతో కొత్త పట్టాలను అమర్చారు. కీలక ప్రాంతాల్లో పాయింట్లు బిగించడంతో పాటు ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రిఫికేషన్‌ పనులను పూర్తి చేస్తున్నారు. వందలాది రైల్వే సిబ్బంది, అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.